డిస్నీ తొలగించిన తర్వాత డీసీ సినిమాటిక్ యూనివర్స్‌లో చేరారు 'గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ' ఫిల్మ్ మేకర్ జేమ్స్ గన్. తాజాగా ఆయన 1970లో జరిగిన యుద్ధ నేపథ్యంతో 'ది సూసైడ్ స్క్వాడ్'ను రూపొందిస్తున్నట్లు ఓ ప్రమోషనల్ వీడియో ద్వారా వెల్లడించారు.
ఆకట్టుకుంటోన్న 'సూసైడ్ స్క్వాడ్' మేకింగ్ వీడియో - వార్నర్ బ్రదర్స్ సూసైడ్ స్క్వాడ్
హాలీవుడ్ దర్శకనిర్మాత జేమ్స్ గన్ రూపొందిస్తున్న 'ది సూసైడ్ స్క్వాడ్' చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో విడుదలైంది. ఇప్పటివరకు తన కెరీర్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఇదేనని వెల్లడించాడు గన్.
'నా కెరీర్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఇదే'
"నేను తెరకెక్కించిన చిత్రాల్లో ఇదే భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది" అని జేమ్స్ తెలిపారు. 'ది సూసైడ్ స్క్వాడ్' చిత్రానికి సంబంధించి విడుదలైన మేకింగ్ వీడియోలో ఇడ్రిస్ ఎల్బా, వియోలా డేవిస్, జాన్సేనా, పీట్ డేవిడ్సన్లు ఉన్నారు.
Last Updated : Aug 23, 2020, 1:51 PM IST