ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ నిర్మించిన పలు హాలీవుడ్ యాక్షన్ చిత్రాల విడుదల తేదీలను వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం 2021 అక్టోబర్ 1న రిలీజ్ అవ్వాల్సిన 'ది బ్యాట్మెన్'ను 2022 మార్చి 4వ తేదీకి వాయిదా వేయగా, 2020 డిసెంబరులో విడుదల అవ్వాల్సిన 'డూన్' 2021 అక్టోబర్ 1న రిలీజ్ కానుంది.
'ది బ్యాట్మెన్' విడుదల తేదీ వాయిదా - batman cinema release date postpone
హాలీవుడ్ యాక్షన్ చిత్రాలైన 'ది బ్యాట్మెన్', 'డూన్' చిత్రాల విడుదల తేదీలు వాయిదా పడ్డాయి. 'ది బ్యాట్మెన్' 2022 మార్చి 4వ తేదీకి వాయిదా పడగా, 'డూన్' 2021 అక్టోబర్ 1న రిలీజ్ కానుంది.
ది బ్యాట్మెన్
అయితే ఈ నిర్మాణ సంస్థ నిర్మించిన మరో సినిమా 'మ్యాట్రిక్స్ 4' విడుదల తేదీ మాత్రం ముందుకు జరిగింది. 2022 ఏప్రిల్ 1న తేదీన విడుదల అవ్వాల్సిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది డిసెంబరు 22కు మార్చారు.
ఇదీ చూడండి 'ఆర్ఆర్ఆర్' నుంచి తారక్ పాత్ర పరిచయం ఎప్పుడంటే!