మౌర్య చక్రవర్తి చంద్రగుప్త మౌర్యపై సినిమా నిర్మించాలన్న కోరికను వ్యక్తపరిచింది బాలీవుడ్ క్వీన్ కంగనారనౌత్. సినీ పరిశ్రమ.. చరిత్రకు తగిన న్యాయం చేయలేదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. జాతీయ అవార్డు విజేతలతో ఓ హిందీ వార్త పత్రిక ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంగళవారం ఆమె హాజరైంది. అందులో భాగంగా భోజ్‌పురీ నటుడు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది.
రవికిషన్:-బిహార్‌తో మీకున్న అనుబంధమేంటి?
కంగనా:- చివరిసారిగా నా చిన్నతనంలో వచ్చాను. ఇది రెండోసారి. నాకు యోగా నేర్పించిన గురువు ఇక్కడివారే.
రవికిషన్:- ఇప్పటికే మణికర్ణిక లాంటి చారిత్రక సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అదే విధంగా బిహార్‌తో అనుబంధం ఉన్న ఏదైనా చారిత్రక నేపథ్య చిత్రాన్ని నిర్మించే అలోచనలు ఉన్నాయా?
కంగనా:- చరిత్రకు సినీపరిశ్రమ తగిన న్యాయం చేయలేకపోయింది. భవిష్యత్తులో చంద్రగుప్తమౌర్యపై సినిమా చిత్రీకరించే అవకాశాలు ఉన్నాయి.