కల్యాణ్‌రామ్ కొంతకాలంగా తన పంథా మార్చుకున్నాడు. వైవిధ్యభరిత కథలతో ప్రయాణం సాగిస్తూ వరుస హిట్లు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే ఆయన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ప్రారంభించాడు.
నేను మంచి వాడినంటున్న కల్యాణ్ రామ్ - entyha manchivadavura
నందమూరి కల్యాణ్ రామ్ పుట్టిన రోజు కానుకగా తన కొత్త చిత్రం టైటిల్ లోగో విడుదల చేసింది చిత్రబృందం. 'ఎంత మంచివాడవురా' అనే క్లాసిక్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడీ నందమూరి హీరో.
తాజాగా ఈ చిత్రానికి 'ఎంత మంచివాడవురా!' అనే టైటిల్‌ను ఖరారు చేసింది చిత్ర బృందం. ఈరోజు కల్యాణ్‌రామ్ పుట్టిన రోజు కానుకగా ఈ చిత్ర లోగో, టీజర్‌ను విడుదల చేశారు. వర్షంలో ఓ చెట్టు కింద తడుస్తూ నించొని ఉన్న ఇద్దరు చిన్నారులకు కల్యాణ్ మొక్కజొన్న పొత్తులు కొనిచ్చి సైకిల్‌పై వెళ్తుండగా.. బ్యాక్ గ్రౌండ్‌లో 'ఎంత మంచివాడవురా' అంటూ ఏయన్నార్ 'నమ్మినబంటు' చిత్రంలోని పాటతో టీజర్‌ను ఆసక్తికరంగా చూపించారు. ఇందులో కల్యాణ్‌కు జోడీగా మెహరీన్ నటిస్తోంది.
ఇవీ చూడండి.. సాహో 'సైకో సయాన్' సాంగ్ టీజర్