తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'చిరుతో రెండు రీమేక్​లు అలా కుదిరాయి' - ఆలీతో సరదాగా వినాయక్ చిరంజీవిీ

మాస్ చిత్రాల దర్శకుడు వీవీ వినాయక్.. మెగాస్టార్ చిరంజీవితో రెండు సినిమాలు తీశారు. అయితే ఆ రెండు కూడా రీమేక్​లే కావడం గమనార్హం. అయితే అలా రెండు రీమేక్​లు పట్టాలెక్కడానికి గల కారణాల్ని ఆలీతో సరదాగా షోలో పంచుకున్నారు వినాయక్.

VV Vinayak about Remakes with Chiranjeevi
'చిరుతో రెండు రీమేక్​లు అలా కుదిరాయి'

By

Published : Oct 23, 2020, 5:26 PM IST

మాస్ చిత్రాల దర్శకుడు వీవీ వినాయక్. అగ్ర కథానాయకులతో సినిమాలు తీసి మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్​గా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవితో రెండు చిత్రాలు తెరకెక్కించారు. అయితే ఈ రెండూ రీమేక్ కావడం గమనార్హం. ఇటీవల ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న వినాయక్.. మెగాస్టార్​తో తీసిన​ రెండు చిత్రాలు రీమేక్ కావడంపై స్పందించారు.

"అసలు చిరంజీవిగారి దగ్గరకు వెళ్దామన్న ఆలోచనే లేదు. కానీ ఓరోజు రాజా రవీంద్ర వచ్చి చిరు దగ్గరికి తీసుకెళ్లారు. నేను 'విజేత' ఫంక్షన్​కు వెళ్లి ఆయనను చూడలేక చెప్పులు పోగొట్టుకుని వచ్చినోడిని.. అలా అంత దగ్గరగా ఆయన్ని చూడటం చాలా సంతోషాన్నిచ్చింది. ఓ అరగంట పాటు ఆయన్ని ఆలా చూస్తూ ఉండిపోయా. ఆయన మాట్లాడుతున్నా నాకేమీ వినిపించట్లేదు. 'రమణ' చూశారా! అని చిరు ఆడిగారు. 'చూశా సార్' అన్న. 'నాకు సరిపోద్దా' అన్నారు. 'అదిరిపోద్ది సార్' అన్నా. కాకపోతే ఎండ్​లో చనిపోకూడదు. కొంచెం కమర్షియల్​గా పాటలు, ఫైట్లు ఉంటే ఇంకా బాగుంటది.. వేరేగా అన్ని చెప్పా. 'వేరేగా అంటే ఏంటి' అని అడిగారు. అప్పుడు ఆయన సీఎం అయితే అన్నట్లు ఓ కథ రాశా. దాంట్లోని కొన్ని డైలాగ్​లు ఆయనకి చెప్పా. అలా నాలుగు సిట్టింగ్​లు అయ్యాక ఓకే అన్నారు. సినిమా పూర్తయ్యి రషెస్ చూసి చాలా మెచ్చుకున్నారు. అది నా జీవితంలో మర్చిపోలేనిది. సొంత కథైనా, రీమేక్​ అయినా అది కాస్త తగినట్లు ఉండాలి. అలా కొన్ని మార్పులు ఆయనకు నచ్చి సినిమాలు పట్టాలెక్కాయి" అని తెలిపారు వినాయక్.

ABOUT THE AUTHOR

...view details