రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగేందుకు ఉన్న సమయం రెండు రోజులే. ప్రచారాలకు నేటితో తెరపడింది. ఈ సమయంలో ఓటరు నీ విలువ తెలుసుకో అంటూ సాగే ఓ సినిమా గీతం విడుదలైంది. మంచు విష్ణు నటించిన 'ఓటర్' సినిమాలోనిదే ఈ పాట.
రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం సగటు పౌరుడ్ని ఆలోచింపజేసేలా ఉంది. ఓటర్ కింగ్ మేకర్.. రింగ్ మాస్టర్..ఓటు విలువ తెలుసుకో అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. తమన్ సంగీతాన్ని అందించాడు.