తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వాళ్లిద్దరి మధ్య' జరిగిందేంటో డిసెంబరులో తెలుస్తుందా! - vn aditya new movie

వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి 'వాళ్లిద్దరి మధ్య' అనే టైటిల్ ఖరారు చేశారు. శరవేగంగా షూటింగ్ జరపుకొంటున్న ఈ చిత్రం డిసెంబరు మొదటి వారానికి పూర్తికానుంది.

'వాళ్లిదరి మధ్య' ఏ జరిగిందో డిసెంబరులో తెలుస్తుంది!

By

Published : Nov 1, 2019, 4:54 PM IST

'మనసంతా నువ్వే','నేనున్నాను' లాంటి హిట్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు వీఎన్ ఆదిత్య. ఆయన తెరకెక్కిస్తున్న కొత్త చిత్రానికి 'వాళ్లిద్దరి మధ్య' అనే టైటిల్ ఖరారైంది. ఇందులో విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ హీరో హీరోయిన్లు.

హీరోహీరోయిన్లు విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ

"సృజనాత్మకత, విభిన్నతకు పెద్దపీట వేసే నిర్మాతతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఆర్టిస్టుల ఎంపిక కోసం చాలా కసరత్తులు చేశాం. సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ మేనల్లుడు విరాజ్ అశ్విన్ ఈ కథకు హీరోగా సరిగ్గా కుదిరాడు".

- వీఎన్ ఆదిత్య, దర్శకుడు.

వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం డిసెంబరు మొదటి వారానికి పూర్తికానుంది.

ఇదీ చదవండి: చిరు, చరణ్​లకు ప్రధాని నుంచి పిలుపు..!

ABOUT THE AUTHOR

...view details