విశాఖ 'గ్యాస్‌లీక్' ఘటనపై టాలీవుడ్ విచారం - Vizag gas leak
వైజాగ్‌లో జరిగిన గ్యాస్ లీక్ ఘటనపై ట్విట్టర్ ద్వారా తమ సానుభూతి తెలుపుతున్నారు టాలీవుడ్ సెలబ్రిటీలు. అస్వస్థతకు గురైన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

విశాఖపట్నం గ్యాస్ లీక్ ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్న టాలీవుడ్ ప్రముఖులు
విశాఖపట్నంలో ఈరోజు ఉదయం జరిగిన గ్యాస్ లీక్ ఘటనపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, అస్వస్థతకు గురైన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ విషయమై ట్వీట్లు చేస్తున్నారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, జూ.ఎన్టీఆర్, మహేశ్‌బాబు, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, నాగశౌర్య, నాని, అల్లరి నరేశ్, శ్రీకాంత్‌తో పాటు దర్శకులు మారుతి, బాబీ, సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.