ప్రధాన మంత్రి మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా "పీఎం నరేంద్ర మోదీ". వివేక్ ఒబెరాయ్ మోదీ పాత్రలో కనిపించనున్నాడు. ఏప్రిల్ 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ట్విట్టర్లో పంచుకున్నాడీ బాలీవుడ్ హీరో.
మేరీ కోమ్, సరబ్జిత్ సినిమాలతో ఆకట్టుకున్న ఒమంగ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
జనవరిలో గుజరాత్లో మొదలయిన ఈ చిత్ర షూటింగ్ ముంబయిలో పూర్తైంది. దర్శన్ కుమార్, బొమ్మన్ ఇరానీ, ప్రశాంత్ నారాయణన్, జరీనా వాహబ్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
ఇది ప్రత్యేకమైన చిత్రం. అందరికీ చెప్పాల్సిన కథ. ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను ---సందీప్ సింగ్, చిత్ర నిర్మాత
గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదలైన మోదీ ప్రయాణం 2014లో ప్రధానమంత్రి అయ్యే వరకు ఎలా సాగిందో ఈ సినిమాలో చూపించనున్నారు. జనవరిలో 23 భాషల్లో విడుదలైందీ సినిమా ఫస్ట్‌లుక్. వివేక్ ఒబెరాయ్ తన ఆహార్యంతో ఆకట్టుకున్నాడు.