అన్లాక్ 5.0లో భాగంగా సినిమా హాళ్లను అక్టోబరు 15 నుంచి తిరిగి తెరుచుకోనున్నట్లు కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బయోపిక్ 'పీఎమ్ నరేంద్రమోదీ'ని మళ్లీ విడుదల చేయాడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. దీంతో లాక్డౌన్ తర్వాత థియేటర్లలో రిలీజ్ కాబోయే తొలి సినిమాగా నిలవనుంది. ఈ విషయాన్ని సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ తెలియజేశారు.
లాక్డౌన్ తర్వాత థియేటర్లలో విడుదలయ్యే తొలి చిత్రమిదే - పీఎమ్ నరేంద్ర మోదీ బయోపిక్
ప్రధానమంత్రి నరేంద్ర బయోపిక్.. మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. లాక్డౌన్ తర్వాత సినిమా హాళ్లలో విడుదలయ్యే తొలి చిత్రంగా నిలవనుంది.
థియేటర్లలో విడుదల కానున్న తొలి చిత్రమిదే
గతేడాది మే 24న 'పీఎమ్ నరేంద్రమోదీ' ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రధాన పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటించారు.. బొమన్ ఇరానీ, మనోజ్ జోషి, ప్రశాంత్ నారాయణన్, బర్ఖా బిష్ట్, రాజేంద్ర గుప్తా, జరీనా వహాబ్ కీలకపాత్రలు పోషించారు. సందీప్ సింగ్, ఆనంద్ పండిట్, సురేశ్ ఒబెరాయ్ సంయుక్తంగా నిర్మించారు.