ఎగ్జిట్ పోల్స్‌పై అభ్యంతరకర ట్వీట్ చేసి వార్తల్లో నిలిచిన వివేక్ ఒబెరాయ్ ఈ విషయంపై వివరణ ఇచ్చాడు. తానేం తప్పు చేశానో చెప్పాలని ప్రశ్నించాడు. తప్పుచేసినట్లు నిరూపిస్తే క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని బదులిచ్చాడు.
"ఈ విషయాన్ని ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారో అర్ధం కావడం లేదు. ఎవరో ఈ మీమ్ నాకు పంపారు. నేను అది చూసి నవ్వుకున్నాను. అతడిని అభినందించాను. ఎవరైనా మీపై ఛలోక్తులు విసిరితే దాన్ని అంత సీరియస్‌గా తీసుకోవద్దు. మహిళా సాధికారత కోసం 10 ఏళ్ల పాటు పనిచేశా. ఇది ఎవరి మనోభావాలు దెబ్బతీస్తుందని అనుకోవట్లేదు." -వివేక్ ఒబెరాయ్, నటుడు