'వైవా' సిరీస్‌తో నటుడిగా గుర్తింపు తెచ్చుకుని.. ప్రస్తుతం పలు సినిమాల్లో హాస్యనటుడిగా రాణిస్తున్నారు హర్ష. బుధవారం రాత్రి ఆయన ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌కు చెందిన అక్షరతో ఆయన వివాహం ఘనంగా జరిగింది. నగరంలోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్ ఈ వేడుకకు వేదికగా మారింది.
వేడుకగా హాస్య నటుడు వైవా హర్ష వివాహం - viva harsha marriage news
షార్ట్ ఫిల్మ్స్‌తో పాటు సినిమాల్లోనూ మెప్పిస్తున్న వైవా హర్ష వివాహం ఘనంగా జరిగింది. పలువురు సినీ ప్రముఖులు హాజరై దంపతుల్ని దీవించారు.
వైవా హర్ష వివాహం
ఏడు రోజులపాటు జరిగిన పెళ్లి వేడుకల్లో వధూవరుల కుటుంబసభ్యులు, స్నేహితులతోపాటు పలువురు సినీ ప్రముఖులు సైతం పాల్గొన్నారు. దర్శకుడు మారుతి, నటుడు ప్రవీణ్, స్వాతి రెడ్డి, మహాతల్లి ఫేమ్ జాహ్నవి పాల్గొని వధూవరులకు అభినందనలు తెలిపారు. మరోవైపు సుహాస్ కథానాయకుడిగా నటించిన 'కలర్‌ఫొటో'లోనూ హర్ష తనదైన నటనతో మెప్పించారు. ఇటీవల విడుదలైన 'గల్లీరౌడీ'లోనూ హర్ష నటించారు.
ఇవీ చదవండి: