ఇటీవలే థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన 'హిట్' చిత్రంతో విజయం అందుకున్నాడు హీరో విశ్వక్ సేన్. ఈ ఉత్సాహంలో తన తదుపరి చిత్రాన్నీ ఖరారు చేశాడీ హీరో. ఓ వినూత్న ప్రేమకథగా రానున్న 'పాగల్' చిత్రం గురువారం(నేడు) లాంఛనంగా ప్రారంభమైంది. నరేశ్ కుప్పిలి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.
'పాగల్'గా దర్శనమివ్వనున్న విశ్వక్ సేన్ - విశ్వక్ సేన్
విశ్వక్ సేన్ కీలకపాత్రలో శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన థ్రిల్లర్ చిత్రం 'హిట్'. ఈ సినిమాతో విజయం అందుకున్న విశ్వక్ ఇదే ఉత్సాహంతో తర్వాతి సినిమాను ఖరారు చేశాడు. ప్రేమకథగా తెరకెక్కుతోన్న ఈ సినిమా గురువారం లాంఛనంగా ప్రారంభమైంది.

ప్రేమ 'పాగల్'గా దర్శనమివ్వనున్న విశ్వక్ సేన్
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు స్క్రిప్ట్‌ను చిత్రబృందానికి అందజేశాడు. రానా దగ్గుబాటి క్లాప్కొట్టాడు. జెమిని కిరణ్ స్విచ్ఛాన్ చేశాడు. ముహూర్తపు సన్నివేశానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నాడు. రధన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇదీ చదవండి:జాన్వీ, కియారాతో రొమాన్స్ చేస్తా: విజయ్