తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'క్లిష్ట పరిస్థితుల్లో వస్తున్నాం.. ఆశీర్వదించండి' - పాగల్​ మూవీ రిలీజ్​

'పాగల్' సినిమా(paagal movie) ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో.. ప్రేక్షకులు తమను ఆశీర్వదించాలని కోరారు హీరో విశ్వక్ సేన్‌. క్లిష్ట పరిస్థితుల్లో సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నామని అన్నారు.

paagal movie
పాగల్​ మూవీ రిలీజ్

By

Published : Aug 11, 2021, 8:36 AM IST

''పాగల్‌' ప్రేమకథ మాత్రమే కాదు.. ప్రేమ గురించి చెప్పే కథ" అన్నారు విశ్వక్ సేన్‌. ఆయన కథానాయకుడిగా నరేష్‌ కుప్పిలి తెరకెక్కించిన చిత్రమిది(paagal movie). దిల్‌రాజు, బెక్కెం వేణుగోపాల్‌ సంయుక్తంగా నిర్మించారు. నివేదా పేతురాజ్‌, సిమ్రన్‌ చౌదరి, మేఘలేఖ కథానాయికలు. ఈ సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే విశ్వక్ తండ్రి రాజు మంగళవారం హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు.

అదే ఆశిస్తున్నాం..

ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్‌ మాట్లాడుతూ "ఈ సినిమాను నేను, బెక్కెం వేణుగోపాల్‌ ఎంత నమ్మామో.. దిల్‌రాజు అంతే నమ్మారు. అందరం కలిసి ఎంతో ప్రేమించి ఈ చిత్రం చేశాం. ఇందులో మొత్తం ఐదు ప్రేమకథలుంటాయి. వీటితో పాటు బలమైన తల్లి సెంటిమెంట్‌ ఉంటుంది. ఈ సినిమాలో నా తల్లిగా భూమిక నటించారు. టీజర్‌, ట్రైలర్లలో కనిపించని మరోనాయిక సినిమాలో ఉంది. ఆమె ఎవరన్నది తెరపైనే చూడాలి. చాలా క్లిష్ట పరిస్థితుల్లో సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నాం. కచ్చితంగా ప్రేక్షకులంతా మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం" అన్నారు.

నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ మాట్లాడుతూ "దిల్‌రాజు ఇచ్చిన ధైర్యంతోనే రిస్క్‌ అయినా సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ఈ చిత్రం విషయంలో హీరో విష్వక్‌తో పాటు నివేదా, సిమ్రాన్‌, మేఘ.. ఇతర నటీనటులంతా ఎంతో సహకరించారు. అందరికీ థ్యాంక్స్‌" అన్నారు.

ఇదీ చదవండి:ఎంగేజ్​మెంట్​ పూర్తి.. నెక్ట్స్​ పెళ్లే అంటున్న నయన్​

ABOUT THE AUTHOR

...view details