తనదైన శైలి నటనతో ప్రేక్షకుల మెప్పుపొంది నేచురల్ స్టార్‌గా ఎదిగాడు హీరో నాని. అనంతరం నిర్మాతగానూ మారాడు. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై 'అ!' చిత్రాన్ని తెరకెక్కించాడు. మంచి విజయం అందుకోవడమే కాదు అవార్డులనూ సొంతం చేసుకుందీ సినిమా. అదే ఉత్సాహంతో మరికొన్ని చిత్రాలను ప్లాన్ చేస్తున్నట్లు గతంలో చెప్పాడీ హీరో.
నాని నిర్మాణంలో విశ్వక్ సేన్...! - nani produse vishwak sen movie'
నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో మరో సినిమా తెరకెక్కబోతుందట. ఈ చిత్రంలో 'ఫలక్‌నుమా దాస్' ఫేం విశ్వక్సేన్ హీరోగా నటించబోతున్నట్లు సమాచారం.
![నాని నిర్మాణంలో విశ్వక్ సేన్...!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4488304-thumbnail-3x2-nani.jpg)
నాని
అయితే తాజాగా ఈ విషయంపై ఓ ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. అదేంటంటే?.. 'ఫలక్‌నుమా దాస్' చిత్ర కథానాయకుడు విశ్వక్ సేన్‌తో ఓ సినిమాను నిర్మించేందుకు సిద్ధమవుతున్నాడట నాని. ఏ జోనర్, దర్శకుడు ఎవరు.. వంటి వివరాలు ఇంకా బయటకు రాలేదు. అతి త్వరలోనే ఈ ప్రాజెక్టుపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పుడిదే వార్త సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం నాని 'వి' చిత్రంతో బిజీగా ఉన్నాడు.
ఇవీ చూడండి.. గోపీచంద్‌తో మరోసారి సంపత్ నంది
Last Updated : Oct 1, 2019, 4:58 AM IST