'ఫలక్ నుమా దాస్', 'హిట్', 'పాగల్' లాంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విశ్వక్ సేన్ (Vishwak Sen New Movie) నటిస్తున్న మరో చిత్రం 'ఓరి దేవుడా' (Ori Devuda Movie). పీవీపీ సినిమాస్, శ్రీ వెంటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశ్వంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కొంపల్లిలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో 'ఓరి దేవుడా' మోషన్ పోస్టర్‌ను చిత్ర బృందం లాంఛనంగా విడుదల చేసింది.
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌తో చర్చ్ ప్రాంతంలో ఎగిరిపోతున్న సీతాకోక చిలుకను పట్టుకునేందుకు విశ్వక్ సేన్ ప్రయత్నిస్తున్న టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన (Ori Devuda Telugu Movie Cast) నూతన కథానాయిక మిథిలా పాల్కర్ నటిస్తుండగా.. ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ సంభాషణలు అందిస్తుండటం విశేషం.