తెలంగాణ

telangana

ETV Bharat / sitara

"పాగల్​' చూడాలంటే టీవీలు, ఫోన్లు సరిపోవు!' - పాగల్​ ఓటీటీ రిలీజ్​పై విశ్వక్​

యువ కథానాయకుడు విశ్వక్​సేన్​ హీరోగా నటించిన 'పాగల్'​ చిత్రం త్వరలోనే ఓటీటీలో విడుదల కానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే వీటిపై స్పందించిన విశ్వక్​.. థియేటర్లలోనే కలుద్దామని స్పష్టతనిచ్చాడు.

vishwak sen clarifies Rumours on Paagal OTT release
"పాగల్​' చూడాలంటే టీవీలు, ఫోన్లు సరిపోవు!'

By

Published : May 18, 2021, 7:03 PM IST

Updated : May 18, 2021, 9:48 PM IST

'పాగల్'​ సినిమా విడుదల గురించి వస్తోన్న వరుస కథనాలపై ఆ చిత్ర కథానాయకుడు విశ్వక్‌సేన్‌ స్పందించారు. ఆ వార్తలు కేవలం పుకార్లేనని స్పష్టతనిచ్చారు.

గతేడాది 'హిట్‌'తో ప్రేక్షకులను అలరించిన విశ్వక్‌ ప్రస్తుతం 'పాగల్‌' కోసం వర్క్ చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆఖరి దశలో ఉన్న ఈ సినిమా షూట్‌ కొంతకాలం నుంచి వాయిదా పడింది. మరోవైపు లాక్‌డౌన్‌ వల్ల మూతబడిన థియేటర్లు ఎప్పుడు తెరచుకుంటాయో పూర్తిగా స్పష్టత లేదు. ఈ క్రమంలోనే 'పాగల్​' చిత్రాన్ని త్వరలో ఓటీటీలో విడుదల చేయనున్నారంటూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ రూమర్లపై హీరో విశ్వక్​సేన్​ స్పందించారు.

'పాగల్​' రిలీజ్​పై విశ్వక్​సేన్​ క్లారిటీ

"ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. మనం మరలా తిరిగి థియేటర్లలోనే కలుద్దాం బ్రదర్‌. మా సినిమాలో రీసౌండ్‌లు ఎక్కువ. ఎమోషన్స్‌ అంతకంటే ఎక్కువ. వాటిని సరిగ్గా ఆస్వాదించడానికి మీ టీవీలు, ఫోన్‌లు సరిపోవు. కాబట్టి ప్రస్తుతానికి జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి. అలాగే మీ ప్రియమైన వారిని సంరక్షించుకోండి."

- విశ్వక్​సేన్​, యువ కథానాయకుడు

విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న 'పాగల్‌' చిత్రానికి నరేశ్​ కొప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. నివేదా పేతురాజ్​, సిమ్రన్‌ చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు.

ఇదీ చూడండి..ఆ వార్తల్లో నిజం లేదు: 'ఉప్పెన' బ్యూటీ

Last Updated : May 18, 2021, 9:48 PM IST

ABOUT THE AUTHOR

...view details