మలయాళంలో విజయవంతమైన 'అంగమలై డైరీస్'(Angamaly Diaries) చిత్రాన్ని తెలుగులో 'ఫలక్నుమా దాస్'(Falaknuma Das) పేరుతో రీమేక్ చేసి ప్రేక్షకుల మెప్పు పొందారు కథా నాయకుడు విశ్వక్ సేన్(Vishwak Sen). ఆయన ఈ సినిమాను తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పుడాయన ఈ చిత్రానికి సీక్వెల్గా 'ఫలక్నుమా దాస్ 2' తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులకు తెలియజేశారు. 'ఫలక్నుమా దాస్'(Falaknuma Das Sequel) ముహూర్తపు కార్యక్రమానికి సంబంధించిన ఓ పాత ఫొటోను విశ్వక్ ఇన్స్టాలో షేర్ చేశారు.
"మూడేళ్ల కిత్రం 'ఫలక్నుమా దాస్' ముహూర్తం షాట్. నిన్ననే జరిగినట్లు అనిపిస్తుంది. ఈ చిత్రబృందం 'ఫలక్నుమా దాస్ 2' కోసం త్వరలోనే తిరిగి కలవబోతుంది."