యువ కథానాయకుడు విశ్వక్‌సేన్ 'విశ్వక్' సినిమా టీజర్‌ను విడుదల చేశాడు. అజయ్ కతుర్వార్, డింపుల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఇది. వేణు ముల్కల దర్శకత్వం వహిస్తున్నాడు. గోల్డెన్ డక్ ప్రొడక్షన్స్ పతాకంపై తాటికొండ ఆనందం బాలకృష్ణన్ నిర్మిస్తున్నాడు. విభిన్న కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రచార చిత్రాన్ని బట్టి తెలుస్తోంది.
'ఫుడ్, బెడ్ బాగుందని పక్కింటికి వెళతావా..?' - విశ్వక్ సినిమా టీజర్
'విశ్వక్' సినిమా టీజర్‌ను శుక్రవారం యువకథానాయకుడు విశ్వక్‌సేన్ సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేశాడు. అజయ్ కతుర్వాల్, డింపుల్ హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా.. వేణు ముల్కల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ టీజర్‌లోని సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి.
"ఎన్నారైలకేమో బాధ్యత తెలియదు. ఇక్కడున్న వారికేమో నిర్లక్ష్యం.. మరి నువ్వేం.." అని హీరో ఓ వ్యక్తి చెంప పగలగొట్టి మరీ ప్రశ్నిస్తూ కనిపించాడు. ఓ యువకుడు రైతులపై ఆసక్తికర కథనం రాస్తున్నానని చెబితే.. అలా కాకుండా యువత ఒత్తిడిపై కథనం రాయమని ఓ యువతి ప్రోత్సహించడం ఆసక్తికరంగా అనిపించింది. "ఫుడ్, బెడ్ బాగుందని పక్కింటికి వెళ్లి బతుకుతావా?, బెటర్ లైఫ్ ఉందని పక్కదేశానికి వెళ్తావా?.." అంటూ కథానాయకుడు పలికిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.
ఇదీ చూడండి..'కలరాను కాల్చేశాం.. మశూచిని మసి చేశాం'