తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కవచం సినిమా రీమేక్​లో హీరో విష్ణువిశాల్..?

తెలుగులో అంతగా ఆకట్టుకోని కవచం సినిమాను తమిళంలో రీమేక్ చేయనున్నారట. ఇందులో రాట్టసన్ హీరో విష్ణు విశాల్ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు సమాచారం.

కవచం

By

Published : Oct 9, 2019, 6:23 PM IST

కోలీవుడ్ చిత్రం 'రాట్టసన్'​ను తెలుగులో రాక్షసుడు పేరుతో రీమేక్ చేశాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తాజాగా రాట్టసన్ హీరో విష్ణు విశాల్.. అల్లుడు శీను నటించిన 'కవచం' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయనున్నాడట.

తెలుగులో అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ కోలీవుడ్​ నిర్మాతలకు కవచం కథ నచ్చడం వల్ల రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇందులో విష్ణు విశాల్ హీరోగా ఎంచుకున్నట్లు సమాచారం. మరి తమిళ తంబీలను కవచం ఎలా ఆకట్టుకుందో వేచి చూడాలి.

ఇదీ చదవండి: ఆసక్తికరంగా ఓ పేద జంట ప్రేమకథ..!

ABOUT THE AUTHOR

...view details