FIR movie ban: ఈ రోజు థియేటర్లలో మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో 'ఎఫ్ఐఆర్' ఒకటి. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల చేశారు. అయితే ఈ సినిమాను కొన్ని దేశాల్లో నిషేధించారు. ఈ విషయాన్ని స్వయంగా హీరో-నిర్మాత విష్ణు విశాల్ స్పష్టం చేశారు.
'FIR' సినిమాపై ఆ మూడు దేశాల్లో నిషేధం - విష్ణు విశాల్ ఎఫ్ఐఆర్ మూవీ
FIR movie: తమిళ హీరో విష్ణు విశాల్ 'ఎఫ్ఐఆర్' సినిమాను మూడు అరబ్ దేశాల్లో నిషేధించారు. శుక్రవారమే ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది.
ఇర్ఫాన్ అహ్మద్ అనే ముస్లిం యువకుడు.. టెర్రరిజంతో సంబంధం లేకపోయినా అనుకోకుండా అందులో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమా కథ. శుక్రవారం రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను కువైట్, మలేసియా, ఖతర్ దేశాల్లో నిషేధించారు. ఓ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ, హీరో విష్ణు విశాల్ సమాధానమిచ్చారు.
ఈ సినిమాలో మంజిమా మోహన్, రైజా విల్సన్, రెబా జాన్ హీరోయిన్లుగా నటించారు. గౌతమ్ మేనన్ కీలకపాత్ర పోషించారు. మను ఆనంద్ దర్శకత్వం వహించారు. తెలుగులో హీరో రవితేజ సమర్పణలో ఈ చిత్రం రిలీజ్ అవుతుంది.