Vishal samanyudu trailer: తమిళ హీరో విశాల్ నటిస్తున్న 'సామాన్యుడు' చిత్ర ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. యాక్షన్, రొమాంటిక్ సీన్స్‌తో ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి శరవణన్ దర్శకత్వం వహించారు. హీరోయిన్గా డింపుల్ హయాతి నటించింది. యోగిబాబు, బాబురాజ్ జాకబ్, పీఏ తులసి తదితురులు కీలక పాత్రలు పోషించారు.
Jai Bhim record: మాస్ పాత్రల్లోనే కాదు, అప్పుడప్పుడు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తారు నటుడు సూర్య. అలా ఆయన నటించి, నిర్మించిన చిత్రం 'జై భీమ్'. తా.సే.జ్ఞానవేల్ దర్శకుడు. గతేడాది నవంబరులో ఓటీటీలో విడుదలైన ఈ సినిమా విమర్శకులను సైతం మెప్పించింది. ఇప్పుడీ సినిమా మరో ఘనతను అందుకుంది. 9వ నొయిడా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్-2022కు ఎంపికైంది.
సాంగ్‌తో
Viswaksen new movie: విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడు విద్యాసాగర్ తెరకెక్కిస్తున్న చిత్రం 'అశోకవనంలో అర్జునకళ్యాణం'. తాజాగా ఈ చిత్రంలోని 'ఊ ఆడపిల్ల' లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ సమర్పణలో ఎస్.వి.సి.సి. డిజిటల్ పతాకంపై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుక్సర్ హీరోయిన్.
'పుష్ప' మాస్క్
Pushpa movie: ట్రాఫిక్ ఉల్లంఘనలు, కొవిడ్ నిబంధనలు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ మధ్య అధికారులు కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. సినిమాల్లో పాపులర్ డైలాగ్‌లతో మీమ్స్‌ను రూపొందించి సోషల్‌మీడియాలో పోస్టులు చేస్తున్నారు. తాజాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కూడా కరోనా నిబంధనలను ప్రజలపై అవగాహన కల్పించేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ 'పుష్ప (Pushpa: The Rise)' సినిమాను ఎంచుకుంది. ఇందులోని ఫేమస్ 'తగ్గేదేలే' డైలాగ్‌తో ఓ మీమ్‌ను క్రియేట్ చేసింది. 'పుష్ప.. పుష్ప రాజ్ (PushpaRaj)..తగ్గేదేలే' ను కాస్త మార్చి.. 'డెల్టా అయినా ఒమిక్రాన్ అయినా.. మాస్క్ తీసేదేలే' అని రాశారు.
ఇదీ చూడండి: బాలయ్య 'అఖండ' 50 డేస్.. విజయానికి కారణాలివే!