తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇన్​స్పెక్టర్ దయ మళ్లీ వస్తున్నాడు..! - NTR

ఎన్టీఆర్ 'టెంపర్'కు రీమేక్​గా తమిళంలో తెరకెక్కిన 'అయోగ్య'.. అదే పేరుతో తెలుగులోనూ విడుదల కానుంది. జూన్​లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఇన్​స్పెక్టర్ దయ మళ్లీ వస్తున్నాడు..!

By

Published : May 25, 2019, 7:56 PM IST

హీరో విశాల్ నటించిన త‌మిళ చిత్రం 'అయోగ్య'. త‌మిళంలో ఇటీవలే వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్​తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో విడుదల చేయనున్నారు. రాశీఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించింది. ఠాగూర్ మ‌ధు నిర్మించిన ఈ చిత్రాన్ని వెంక‌ట్ మోహ‌న్ డైరెక్ట్ చేశారు. సామ్ సీ.ఎస్ సంగీతం అందించారు.

తెలుగు హ‌క్కుల‌ను మ‌ల్కాపురం శివ‌కుమార్ సొంతం చేసుకున్నారు. జూన్‌లో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నారు.

ABOUT THE AUTHOR

...view details