VISHAL Injury: 'లాఠీ' సినిమా చిత్రీకరణలో నటుడు విశాల్ గాయపడ్డాడు. దీంతో చికిత్స కోసం కేరళ పయనమయ్యారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "'లాఠీ' సినిమా స్టంట్ సీక్వెన్స్ చేస్తుంటే గాయాలయ్యాయి. విశ్రాంతి, చికిత్స కోసం కేరళ వెళ్తున్నా. మార్చి తొలివారంలో ఈ సినిమా తుదిదశ షెడ్యూల్‌లో పాల్గొంటా" అని విశాల్ తెలిపారు.
VISHAL Injury: షూటింగ్‌లో గాయపడ్డ నటుడు విశాల్ - విశాల్‌కు గాయం
VISHAL Injury: ప్రముఖ తెలుగు, తమిళ నటుడు విశాల్‌కు గాయలయ్యాయి. 'లాఠీ' సినిమా చిత్రీకరణ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
విశాల్
విశాల్ చేతి ఎముకలకు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో ఆయన పోలీసు అధికారిగా కనిపించారు. ఓ బాలుడ్ని రక్షించే సన్నివేశం ఇది. ఈ చిత్రాన్ని పవర్‌ఫుల్ పోలీసు కథతో ఎ. వినోద్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో సునయన కథానాయిక. రమణ, నంద నిర్మాతలు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు.