విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ.. మరో సినిమాకు అంగీకారం తెలిపారు. ఈసారి క్రైమ్ థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. '118' చిత్రంతో ఆకట్టుకున్న కేవీ గుహన్.. దీనికి దర్శకత్వం వహించనున్నారు. గురువారం పూజా కార్యక్రమం జరిగింది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
షూటింగ్లో విశాల్.. క్రైమ్ థ్రిల్లర్లో ఆనంద్ - ఆనంద్ దేవరకొండ హైవే మూవీ
మూవీ అప్డేట్స్ వచ్చేశాయి. వీటిలో విశాల్ కొత్త సినిమా షూటింగ్, ఆనంద్ దేవరకొండ కొత్త చిత్రం పూజా కార్యక్రమ విశేషాలు ఉన్నాయి.
మూవీ న్యూస్
కోలీవుడ్ హీరో విశాల్ కొత్త సినిమా షూటింగ్ గురువారం ప్రారంభమైంది. శరవణన్ దర్శకత్వం వహిస్తుండగా, డింపుల్ హయాతీ కథానాయికగా నటిస్తోంది. ఒకే షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తి చేసి, త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
సందీప్ కిషన్ కొత్త సినిమా గురించి శుక్రవారం ఉదయం 10:09 గంటలకు ప్రకటన రానుంది. దర్శకుడు, హీరోయిన్, టైటిల్ తదితర వివరాలు వెల్లడించే అవకాశముంది.