"ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే. హైదరాబాద్ సిటీ మొత్తం హై అలర్ట్‌లో ఉంటుంది. కానీ, ఆరోజు.." అంటూ హైదరాబాద్‌లో జరిగిన దొంగతనం గురించి పరిశోధన మొదలు పెట్టారు హీరో విశాల్. ఆయన కథానాయకుడిగా ఎమ్ఎస్ ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'చక్ర'. శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా కథానాయికలు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
'చక్ర' ట్రైలర్: ఇండిపెండెన్స్ రోజున ఏం జరిగింది! - తెలుగు సినిమ వార్తలు
విశాల్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'చక్ర'. సైబర్ క్రైమ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.
చక్ర
సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. "కంటికి కనిపించని వైరస్ మాత్రమే కాదు.. వైర్‌లెస్ నెట్‌వర్క్ కూడా ప్రమాదకరమే.. వెల్‌కమ్ టు డిజిటల్ ఇండియా" అంటూ ఆగంతకుడు చెప్పిన డైలాగ్‌తో ట్రైలర్ ముగిసింది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ నిర్మిస్తున్నారు.