తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ సీక్వెన్స్ అందరికీ కనెక్ట్​ అవుతుంది: విశాల్ - మూవీ న్యూస్ లేటేస్ట్

'చక్ర' విశేషాల్ని పంచుకున్న విశాల్.. సినిమా అందరికీ నచ్చుతుందనే ధీమా వ్యక్తం చేశారు. ఆర్మీ మెడల్ దొంగతనం నేపథ్య కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

vishal about chakra movie news
చక్ర మూవీ న్యూస్

By

Published : Feb 18, 2021, 6:34 AM IST

ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సైబర్‌ నేరాల పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజెప్పే చిత్రమే 'చక్ర' అని విశాల్‌ అన్నారు. ఆయన హీరోగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రమిది. ఎం.ఎస్‌. ఆనందన్‌ దర్శకుడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలో విశాల్‌ విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.

* సినిమాలో హీరో తండ్రి ఆర్మీ అధికారి. యుద్ధ సమయంలో ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాలకు అశోక చక్ర అవార్డు వస్తుంది. అయితే కొంతమంది దుండగులు దాన్ని దొంగిలిస్తారు. ఈ కేసును ఆర్మీలోనే పనిచేసే ఓ సైనికుడు ఎలా చేధించాడు? ఈక్రమంలో అతనికెదురైన సవాళ్లేంటి? అన్నది మిగతా చిత్ర కథ. అందుకే ఈ కథకు తగ్గట్లుగానే టైటిల్‌ 'చక్ర' అని పెట్టాం. సినిమాలో ఆఖరి 9 నిమిషాలు ఒక థ్రిల్లింగ్‌ సీక్వెన్స్‌ ఉంటుంది. అది అందరికీ కనెక్ట్‌ అవుతుంది.

చక్ర సినిమాలో విశాల్

*సైబర్‌ క్రైమ్‌ కథాంశం కావడం.. నేను మిలటరీ అధికారిగా కనిపిస్తుండటం వల్ల అందరూ ఇది 'అభిమన్యుడు'కి సీక్వెల్‌ అనుకుంటున్నారు. కానీ, కాదు. ఆ సినిమాకు పూర్తి భిన్నమైన చిత్రమిది. ఎంతో పరిశోధన చేసి ఆనందన్‌ ఈ స్క్రిప్ట్‌ సిద్ధం చేశారు.

* ప్రస్తుతం నా బెస్ట్‌ ఫ్రెండ్‌ ఆర్యతో కలిసి 'ఎనిమీ' చిత్రం చేస్తున్నా. అలాగే నా స్వీయ దర్శకత్వంలో 'అభిమన్యుడు 2' తెరకెక్కించనున్నా. వీటితో పాటు తెలుగులో నేరుగా ఓ సినిమా చేయనున్నా.

ABOUT THE AUTHOR

...view details