తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విరుష్క పెళ్లికి రెండేళ్లు.. ఇన్​ స్టాలో ప్రేమ లేఖలు - virushka wedding anniversary posts will melt your hearts

విరుష్క జంట పెళ్లి చేసుకొని నేటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా దంపతులిద్దరూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇన్ స్టా వేదికగా తమ పెళ్లిరోజు సందేశాన్ని పోస్ట్ చేశారు.

virushka wedding anniversary posts will melt your hearts
విరుష్క

By

Published : Dec 11, 2019, 11:42 AM IST

విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ.. విరుష్కగా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట ఒక్కటై నేటికి రెండేళ్లు. పెళ్లి రోజు జరుపుకుంటున్న వీరిద్దరూ ఒకరికొకరు ఇన్​ స్టా వేదికగా శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

'మనం ఒకరిని ప్రేమించగలిగినట్లయితే భగవంతుడిని ప్రత్యక్షంగా చూసినట్లే' అని ప్రముఖ కవి విక్టర్ హూగో కవితను పోస్ట్ చేసింది అనుష్కశర్మ. 'ప్రేమ అనేది భావోద్వేగం మాత్రమే కాదు.. అంతకు మించిన అపురూపమైన భావన. సత్యమార్గంలో నన్ను ముందుకు నడిపే మార్గదర్శకుడి లాంటి వ్యక్తి నాకు దొరకడాన్ని అదృష్టంగా భావిస్తున్నా' అని అనుష్క తన పెళ్లిరోజు సందేశాన్ని పోస్ట్ చేసింది.

'నిజ జీవితంలో ప్రేమ తప్ప మరేదీ లేదు. దేవుడు ఆశీర్వదించి నిన్ను ఒకరితో ముడిపెట్టినపుడు.. ఒకే ఒక్క ఫీలింగ్ నీలో ఉంటుంది. అదే కృతజ్ఞత' అని విరాట్ కోహ్లీ అనుష్కను ఉద్దేశిస్తూ కామెంట్ పెట్టాడు.

చాలా రోజులు ప్రేమ పక్షుల్లా స్వేచ్ఛగా విహరించిన విరాట్ - అనుష్క.. 2017 డిసెంబరు 11న పెళ్లితో ఒక్కటయ్యారు. ఇటలీ టస్కనీ వేదికగా జరిగిన ఈ వేడుకకు అతికొద్దిమంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు.

ఇదీ చదవండి: జాతీయజెండా వైపు చూడలేదని రూ.లక్ష జరిమానా

ABOUT THE AUTHOR

...view details