మానవాళికి ఇప్పుడున్న శత్రువు కరోనా వైరస్ ఒక్కటే. దానికి రాజు, పేద అనే భేదం లేదు. అందరినీ దెబ్బతీస్తుంది. కలసికట్టుగా పోరాడితేనే మహమ్మారిపై విజయం సాధించగలమనే ఇతివృత్తంగా ప్రపంచంలో అనేక సినిమాలు వచ్చాయి. వైరస్‌ల వల్ల ఎలాంటి ప్రమాదాలు పొంచిఉన్నాయో కళ్లకు కట్టినట్టు చూపాయి. అన్ని చిత్రాల సందేశం ఒక్కటే. అంటువ్యాధులు మనలో మనల్నే శత్రువులుగా మారుస్తాయి. భౌతిక దూరం పాటించేలా హితబోధ చేస్తాయి. మనల్నందరినీ ఒక్కటిగా కూడా చేస్తాయి. జట్టుగా సమన్వయంతో పోరాడితేనే విజయం సాధించగలవని పలు సినిమాలు చూపించాయి. ఐ యామ్ లెజెండ్, ట్రైన్ టు బుసాన్, ఇట్ కమ్స్ ఎట్ నైట్, డాన్ ఆఫ్ డెడ్, ద పెయింటెడ్ వేల్, ద హ్యాపెనింగ్, క్వారంటైన్, డూమ్స్ డే, మ్యాగీ వంటి సినిమాలెన్నో ఉన్నాయి. అయితే వీటిలో హింస మోతాదు ఎక్కువగా ఉంది. హింస ప్రధానాంశంగా లేని అలాంటి సినిమాల్లో కొన్ని..
కంటైజన్-2011
స్పర్శ ద్వారా వైరస్ ఎలా వ్యాపిస్తుందో చూపుతుందీ చిత్రం. చైనా నుంచి అమెరికాకు వచ్చిన వ్యక్తితో ఉపద్రవం మొదలవుతుంది. విపత్తు వేళ పరిస్థితుల్ని చూపించారు.
చిల్డ్రన్ ఆఫ్ మెన్-2006
వైరస్‌తో మహిళల్లో వంధ్యత్వం రావడంతో ప్రపంచం పతనం అంచుకు చేరుతుంది. ఈ పరిస్థితుల్లో గర్భవతి అయిన యువతిని దుండగుల మధ్య నుంచి భద్రమైన చోటుకు తీసుకెళ్లడమే కథ.
28 డేస్ లేటర్-2002