తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రానా 'విరాటపర్వం' విడుదల కూడా వాయిదా - rana saipallavi virataparvam

రానా 'విరాటపర్వం' విడుదల కూడా వాయిదా పడింది. ఇప్పటికే 'లవ్​స్టోరి', 'టక్​ జగదీష్' వాయిదా పడిన నేపథ్యంలో మిగిలిన చిత్రాలు పరిస్థితి ఏంటో తెలియాల్సి ఉంది.

rana
రానా

By

Published : Apr 14, 2021, 5:09 PM IST

Updated : Apr 14, 2021, 5:22 PM IST

రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'విరాట పర్వం'. ఏప్రిల్​ 30న థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్ర విడుదలను వాయిదా వేసినట్లు బుధవారం ప్రకటించారు. కరోనా సెకండ్​ వేవ్​ ఉద్ధృతంగా కొనసాగుతుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. త్వరలోనే కొత్త రిలీజ్​ డేట్​ను ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటికే 'లవ్​స్టోరి', 'టక్​ జగదీష్' వాయిదా పడిన నేపథ్యంలో మిగిలిన చిత్రాలు పరిస్థితి ఏంటో తెలియాల్సి ఉంది.

విరాటపర్వం

సురేష్‌బాబు, సుధాకర్‌ చెరుకూరి సంయుక్తంగా 'విరాటపర్వం' చిత్రాన్ని నిర్మించారు. ప్రియమణి, నందితాదాస్‌, ఈశ్వరీరావు, జరీనా వహాబ్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు.

1990లో డాక్టర్ రవిశంకర్ అలియాస్ కామ్రేడ్ రవన్న అనే నక్సలైట్ జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ దేశం ముందు ఒక ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది, సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిదంటూ కామ్రేడ్ రవన్న జీవితాన్ని రానా పాత్రలో అద్భుతంగా చూపించనున్నారు దర్శకుడు వేణు ఊడుగుల.

ఇదీ చూడండి: టీజర్: 'దేశం ముందు అతని జీవితం ఓ ప్రశ్న'

Last Updated : Apr 14, 2021, 5:22 PM IST

ABOUT THE AUTHOR

...view details