రానా, సాయి పల్లవి, ప్రియమణి ప్రధాన పాత్రల్లో దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కిస్తోన్న చిత్రం 'విరాట పర్వం'. ఈ సినిమా ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని కొన్ని రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలపై దర్శకుడు వేణు స్పందించారు.
ఈ సినిమాను డిజిటల్ మాధ్యమంలో విడుదల చేసే ఉద్దేశం లేదని, ఎప్పటికైనా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని తెలిపారు. పరిస్థితులు చక్కబడ్డాక కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.