రానా, సాయిపల్లవి నటించిన సినిమా 'విరాటపర్వం'. ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. అయితే నిర్మాతలు.. దీనిని ఓటీటీలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ విషయంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది.
'విరాటపర్వం' వచ్చేది థియేటర్లలో లేదా ఓటీటీలో? - విరాటపర్వం మూవీ న్యూస్
కొవిడ్ కారణంగా థియేటర్లు మూతపడటం వల్ల విడుదలకు సిద్ధమైన కొన్ని తెలుగు సినిమాలు.. ఓటీటీ వైపు చూస్తున్నాయి. అందులో విరాటపర్వం కూడా ఉందని సమాచారం. త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

సాయిపల్లవి
ఇందులో కామ్రేడ్ రవన్నగా రానా కనిపించనున్నారు. సాయిపల్లవి కథానాయికగా చేస్తోంది. వేణు ఊడుగుల దర్శకుడు. సురేశ్‌బాబు నిర్మించారు. ఇప్పటికే వచ్చిన టీజర్, ఫొటోలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. అయితే చిత్రాన్ని చూడాలనే ప్రేక్షకుల నిరీక్షణకు ఎప్పుడు తెరపడుతుందో?