తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వివాదాలే మా ఇద్దరి మధ్య పోలిక: కంగనా రనౌత్ - వివాదాలే మా ఇద్దరి మధ్య పోలిక కంగనా

ప్రపంచ క్రికెట్​లో రాణిస్తూ, దిగ్గజ క్రికెటర్లతో పాటు అభిమానులను మైమరిపిస్తున్నాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ. వివాదపూరిత వ్యాఖ్యలతో పాటు తనదైన శైలి నటతో ప్రేక్షకుల్ని అలరిస్తోంది కంగనా రనౌత్. అయితే వీరిద్దరి మధ్య పోలికలు ఉన్నాయట. ఈ విషయాన్ని కంగనానే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

Kangana
Kangana

By

Published : Jan 25, 2020, 12:58 PM IST

Updated : Feb 18, 2020, 8:43 AM IST

భారత సారథి విరాట్‌ కోహ్లీకి, తనకి కొన్ని విషయాల్లో పోలికలు ఉన్నాయని బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ చెప్పింది. తాను, కోహ్లీ ఎక్కువ వివాదాలు ఎదుర్కొన్నామని, ఈ కారణంతోనే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నామంది. ఈమె నటించిన 'పంగా'.. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా విరాట్‌ గురించి మాట్లాడిందీ నటి.

"నాకు, కోహ్లీకి కొన్ని విషయాల్లో పోలికలు ఉన్నాయని ఎంతో మంది చెబుతుంటారు. క్రికెట్‌లో అతడు గొప్ప పేరు సంపాదించాడు. అతడిని ఎంతో మంది ప్రేమిస్తారు. మా ఇద్దరి మధ్య ఓ పోలిక ఉంది. మేమిద్దరం ఎక్కువ వివాదాలు ఎదుర్కొన్నాం. ఈ కారణంగానే ఎక్కువ మంది అభిమానులను సంపాదించాం. కోహ్లీకి దూకుడు ఎక్కువ అని విమర్శిస్తుంటారు. నేనూ ఎంతో దూకుడుగా ఉంటాను. క్రీడాకారుడి జీవితం అంత సులువు కాదు. ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆట కోసం వారు తీవ్రంగా సాధన చేస్తారు. ఫిట్‌నెస్‌ కోసం ఎంతో శ్రమిస్తారు"
-కంగనా రనౌత్, బాలీవుడ్ హీరోయిన్

'పంగా' సినిమాలో కంగనా.. జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారిణిగా నటించింది. అశ్వినీ అయ్యర్‌ తివారి దర్శకత్వం వహించారు. శంకర్‌-ఎహసన్-లాయ్ సంగీతం అందించారు.

ఇవీ చూడండి.. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న నటి

Last Updated : Feb 18, 2020, 8:43 AM IST

ABOUT THE AUTHOR

...view details