బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల యువ నటుడు హర్ధవర్ధన్ కపూర్.. ఓ చాట్‌షోలో వీరి డేటింగ్ గురించి బహిర్గతం చేయటం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. గతంలో సల్మాన్ ఖాన్- కత్రినా కైఫ్ మధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లూ వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలో ఓ అవార్డు ఫంక్షన్లో సల్మాన్ ఖాన్ ఎదుటే.. విక్కీ కౌశల్.. కత్రినాకు ప్రపోజ్ చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఓ అవార్డు ఫంక్షన్లో విక్కీ హోస్ట్‌గా ఉండగా.. కత్రినా అవార్డు ఇచ్చేందుకు వచ్చింది. అప్పుడు విక్కీ.. కత్రినాకు ప్రపోజ్ చేశాడు. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ ప్రేక్షకుల మధ్యలో కూర్చున్నారు.