కథానాయికలు ఎప్పటికప్పుడు తమ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకుంటుంటారు. ఈ విషయంలో బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ఎంతో చురుగ్గా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఎందుకో తెలుసా? ఈ సారి ముద్దుగుమ్మ కాజోల్ పోస్ట్ చేసింది తన ఫొటోలు కాదు.. అచ్చం తనలాగే ఉండే తన ముద్దుల కూతురు నైసా దేవగణ్వి.
కాజోల్ పోస్ట్ చేసిన ఆ ఫొటోలు వైరల్.. ఎందుకో తెలుసా? - అజయ్‌దేవగణ్ ఫొటోలు వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్.. ఇన్‌స్టా వేదికగా తన కుమార్తె నైసా దేవగణ్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్‌గా మారాయి.
కాజోల్
పసిడి వర్ణపు లెహెంగా.. జాలువారే కురులు.. కలువల్లాంటి కళ్లు.. పెదాలపై అందమైన చిరునవ్వు... ఆహా! ఆ చిత్రంలో అచ్చం కుందనపు బొమ్మలా కనువిందు చేస్తోంది నైసా. 16 ఏళ్ల వయసున్న ఈ అమ్మాయి.. కాజోల్తోనే అందంలో పోటీ పడుతోందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
ఇదీ చూడండి :'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య..' వెనుక అర్థం ఇదే!