బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు ఊపిరితిత్తుల కేన్సర్ ఉన్నట్లు ఇటీవలే బయటపడింది. దీంతో సినిమాలకు తాత్కాలిక విరామం ప్రకటించి చికిత్స తీసుకుంటున్నారు సంజూ. అయితే ఆయనకు సంబంధించి ఓ కొత్త ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో ఆస్పత్రి ఆవరణలో నిలబడి ఉన్న సంజయ్ కొంచెం నీరసంగా కనిపిస్తున్నారు. ఇది చూసిన అభిమానులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'మున్నాభాయ్ ఎమ్‌బీబీఎస్ త్వరగా కోలుకోవాలి', 'సంజూ.. మీ ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుంటున్నాం', 'బాగా నీరసంగా కనిపిస్తున్నారు' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
సంజయ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలో ఫ్యాన్స్ - సంజయ్‌దత్ క్యాన్సర్
ఊపరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతోన్న బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్‌కు సంబంధించి ఓ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనకు గురౌతున్నారు. త్వరగా సంజూ కోలుకోవాలని కోరుకుంటున్నారు.
సంజు
ప్రస్తుతం సంజూ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న 'షంషేర్', 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా', 'కేజీఎఫ్: చాప్టర్2', 'పృథ్వీరాజ్' చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన 'సడక్ 2' గత నెల ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సంజూ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.