తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Prabhas Salaar: ప్రభాస్ 'సలార్' వీడియో లీక్ - prabhas latest news

రెబల్​స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్​ ఫుల్​ హ్యాపీగా ఉన్నారు. 'సలార్​' షూటింగ్​ వీడియో ఒకటి లీక్ కావడమే అందుకు కారణం. ట్విట్టర్​లో ప్రస్తుతం ఇదే ట్రెండింగ్​లో ఉంది.

prabhas Salaar
ప్రభాస్ సలార్ వీడియో లీక్

By

Published : Aug 11, 2021, 5:30 PM IST

డార్లింగ్ ప్రభాస్ వరుస సినిమాలతో జోరు మీదున్నారు. 'రాధేశ్యామ్' పూర్తయి నిర్మాణనంతర కార్యక్రమాల్లో బిజీ ఉండగా.. 'సలార్', 'ఆదిపురుష్' షూటింగ్​లో పాల్గొంటున్నారు. అయితే 'సలార్' చిత్రీకరణలోని ఓ వీడియో లీకైంది. దీంట్లో ప్రభాస్​ నడుచుకుంటూ వస్తూ కనిపించారు. దాంతో అదికాస్త వైరల్​గా మారింది.

ప్రభాస్.. ఈ వీడియోలో మాస్​గా కనిపిస్తూ, సినిమాపై అంచనాల్ని తెగ పెంచేస్తున్నారు. ఇంతకు ముందెప్పుడూ చేయని వైలెంట్​ రోల్​ ఇందులో డార్లింగ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అలానే ప్రభాస్ ద్విపాత్రాభినయంలోనూ కనిపించనున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

పూర్తిస్థాయి యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్​గా చేస్తోంది. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్​లో 'సలార్'.. థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details