యువ నటీనటులు రిహాన్, సారిక కలిసి నటించిన చిత్రం 'విరహం'. ఇటీవలే సినిమా పోస్టర్ విడుదల చేయగా.. అది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీపావళి కానుకగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయడానికి చిత్రబృందం రంగం సిద్ధం చేసింది. ఈ సినిమాతో సురేందర్ జీ యాదవ్ దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. మాస్టర్ శ్రేయాన్ చౌదరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
దీపావళి కానుకగా 'విరహం' ట్రైలర్ - విరహం సినిమా పోస్టర్ విడుదల
యువ కళాకారులతో సరికొత్త కథాంశంతో రూపొందిన చిత్రం 'విరహం'. ఇటీవలే చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో సినిమా పోస్టర్‌ను చిత్రబృందం ఇటీవలే విడుదల చేసింది. దీపావళి కానుకగా చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.
![దీపావళి కానుకగా 'విరహం' ట్రైలర్ Viraham movie poster released](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9526497-93-9526497-1605189850395.jpg)
దీపావళి కానుకగా 'విరహం' ట్రైలర్
ఈ సినిమా కోసం కో-డైరెక్టర్ జెర్రీ జీవన్‌రెడ్డి, కెమెరామెన్ ధర్మసాయి అద్భుతమైన ప్రతిభ కనబరిచారని దర్శకుడు సురేందర్ జీ యాదవ్ తెలిపారు. విరహం చిత్రం ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని కో-డైరెక్టర్ జెర్రీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా వల్ల థియేటర్లు మూసేసిన కారణంగా త్వరలోనే ఓటీటీలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.