'అపరిచితుడు' నటుడు విక్రమ్ వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లోని పాత్రల కోసం తన ఆహార్యాన్ని మార్చేస్తుంటారు. అలాంటి విక్రమ్ ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు. ఇందులో తన కుమారుడు ధ్రువ్ విక్రమ్‌తో కలిసి పోరాటాలు చేయబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.
కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో విలన్‌గా విక్రమ్?
చియాన్ విక్రమ్, తనయుడు ధ్రువ్‌తో కలిసి ఓ చిత్రంలో నటించబోతున్నారు. ఈ సినిమాకు కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
విక్రమ్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నారని చెప్పుకుంటున్నారు. తనయుడు ధ్రువ్‌తో పోరాటాలు కూడా ఉంటాయట. మరి ఈ విషయం ఎంతవరకు నిజమన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. విక్రమ్ ఇప్పటివరకు వేరొకరి సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించకపోవడం విశేషం.
ఈ సినిమాకు 7 స్క్రీన్ స్టూడియో సమర్పణలో లలిత్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. లాక్‌డౌన్ పూర్తికాగానే చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.