తెలంగాణ

telangana

By

Published : Jun 9, 2020, 5:24 PM IST

ETV Bharat / sitara

విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో సూర్య?

తమిళ నటుడు సూర్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన '24' మంచి విజయాన్ని అందుకుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్​లో మరో సినిమా రానున్నట్లు సమాచారం.

సూర్య
సూర్య

ప్రముఖ తమిళ నటుడు సూర్య చేసే చిత్రాల్లో వైవిధ్యం కనిపిస్తుంది. చిల్లరగా తిరిగే ఆకురౌడీ దగ్గర నుంచి గుండాలకు కూడా చెమటలు పట్టించే సింగంలాంటి చిత్రాల్లోను అలవోకగా నటించి మెప్పిస్తుంటాడు. ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో 'ఆకాశం నీ హద్దురా' చిత్రంలో నటిస్తున్నాడు. సెన్సారు బోర్డు నుంచి 'యు' సర్టిఫికెట్‌ పొందిందీ సినిమా. ఇప్పటికే తెరపై అలరించాల్సిన చిత్రం కరోనా వైరస్‌ వాయిదా పడింది.

ఈ చిత్రం తర్వాత సూర్య మరికొన్ని సినిమాల్లో నటించేందుకు సిద్ధమయ్యాడు. మాస్‌ చిత్రాల దర్శకుడు, హరితో పాటు 'అసురన్'‌ దర్శకుడు వెట్రిమారన్‌తోనూ సినిమా చేస్తున్నాడు. 'మనం' చిత్ర దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌తో కలిసి పనిచేయడానికి ఉత్సాహం చూపుతున్నట్లు ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ముఖాముఖిలో చెప్పాడు. అయితే ఇప్పటికే కథను కూడా విన్నాడట. అంతా కుదిరితే వచ్చే ఏడాది చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని తమిళ సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

2016లో విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో వచ్చిన '24' చిత్రంలో సూర్య హీరోగా నటించాడు. ఇందులో సూర్య తండ్రీ కొడుకు, విలన్​ ఇలా మూడు పాత్రల్లో నటించి మెప్పించాడు. ఇందులో నిత్య మేనన్‌, సమంత కథానాయికలుగా నటించారు. ఏ.ఆర్‌.రెహమాన్‌ సమకూర్చిన సంగీత స్వరాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details