తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'విజిల్​' మహిళలకు అంకితం-అట్లీ - vijay latest movie speech by atlee

కోలీవుడ్ స్టార్​ విజయ్ నటించిన చిత్రం "విజిల్". ఈ సినిమాని ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించాడు. ఈ చిత్ర విడుదల సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు.

'విజిల్​' సినిమా మహిళలకు అంకితం-అట్లీ

By

Published : Oct 24, 2019, 7:28 AM IST

Updated : Oct 24, 2019, 8:00 AM IST

'తమిళ స్టార్​ విజయ్​ నటించిన చిత్రం 'బిగిల్'​. తెలుగులో విజిల్ పేరుతో అక్టోబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో దర్శకుడు అట్లీ తన అభిప్రాయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ప్ర‌స్తుత స‌మాజంలో మ‌హిళ‌ల‌పై జరుగుతున్న అత్యాచారాలపై ఆందోళన చెందానని తెలిపాడు. అందులో నుంచే ఈ సినిమా పుట్టుకొచ్చిందని చెప్పాడు.

"విజిల్ సినిమాను తెలుగులో 700 థియేటర్స్‌లో విడుద‌ల చేస్తుండ‌టం గొప్ప‌గా అనిపిస్తుంది. ఈ సినిమా కేవ‌లం ఫుట్​బాల్ ఆట గురించి మాత్ర‌మే కాదు.. చాలా భావోద్వేగాలు ఇందులో ఉన్నాయి. అలాగే మహిళా సాధికార‌త‌ను తెలియ‌జేస్తుంది. ఈ సినిమాను వాళ్లకు అంకితమిస్తున్నాను."

-అట్లీ, తమిళ దర్శకుడు.

ఈ సినిమాకి ఎక్కడలేని హైప్ వస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్​కి విశేష స్పందన లభిస్తోంది. యూట్యూబ్​లో రెండు మిలియన్లు లైక్​లు వచ్చిన ప్రచారచిత్రంగా రికార్డు సృష్టించింది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇప్పటికే అట్లీ- విజయ్ కాంబినేషన్​లో రెండు బ్లాక్ బాస్టర్ చిత్రాలు వచ్చాయి. తెరి(పోలిస్​), మెర్సల్(అదిరింది) సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. విజిల్​ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌ పై మ‌హేశ్ కోనేరు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నాడు.

ఇదీ చూడండి: బిగ్​ బీ అమితాబ్ నటుడు కాకపోయుంటే!

Last Updated : Oct 24, 2019, 8:00 AM IST

ABOUT THE AUTHOR

...view details