తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Vijay Thalapathy: ఆ సినిమా కోసం విజయ్​కు అన్ని కోట్లా? - విజయ్​ దళపతి భారీ రెమ్యునరేషన్​

దర్శకుడు వంశీ పైడిపల్లితో తమిళ స్టార్​ హీరో విజయ్(Vijay)​ ఓ సినిమా చేయనున్నారంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ చిత్రాన్ని రూ.170కోట్లతో నిర్మించనున్నారంటూ తెలిసింది. ఇందుకోసం దళపతి రూ.90కోట్ల పారితోషికం తీసుకోనున్నారని సినీ వర్గాల సమాచారం.

Vijay Thalapathy
విజయ్​

By

Published : Jun 14, 2021, 5:05 PM IST

కోలీవుడ్​ స్టార్​ హీరో దళపతి విజయ్(Vijay Thalapathy)​ రెమ్యునరేషన్​కు సంబంధించి ఓ వార్త దక్షిణాదిలో హాట్​ టాపిక్​గా మారింది. తన తదుపరి చిత్రం కోసం రూ.90కోట్లు తీసుకోనున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.

విజయ్​.. దిల్​రాజు(Dilraju) నిర్మాణంలో దర్శకుడు వంశీ పైడిపల్లితో(Vamsi Paidipally) ఓ సినిమా చేయనున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్​ను రూ.170కోట్లతో నిర్మించనున్నారని, దీని కోసమే దళపతి పెద్ద మొత్తంలో తీసుకోనున్నట్లు అంతా మాట్లాడుకుంటున్నారు. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.

ప్రస్తుతం విజయ్​.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. కరోనా కారణంగా షూటింగ్​ ప్రస్తుతం నిలిచిపోయింది.

ఇదీ చూడండి: The Family Man 2: సమంత రెమ్యునరేషన్ అన్ని కోట్లా?

ABOUT THE AUTHOR

...view details