దళపతి విజయ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన 'మాస్టర్' చిత్రం నెట్టింట లీక్ అయ్యింది. సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు విడుదలకు ముందే సోషల్‌మీడియాలో దర్శనమివ్వడంపై చిత్రబృందం ఆశ్చర్యానికి గురైంది. దీనిపై స్పందించిన చిత్రబృందం.. దయచేసి పైరసీ లింక్‌లను షేర్ చేయొద్దని ప్రేక్షకులను వేడుకుంటోంది. సినిమాలో విజయ్ ఎంట్రీ సహా మరికొన్ని కీలక సన్నివేశాలు బయటకు వచ్చాయని తెలుస్తోంది.
అయితే సోషల్‌మీడియాలో వైరల్ అయిన వీడియోలు.. డిస్ట్రిబ్యూటర్ల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించిన షోకు సంబంధించినవని కొన్ని వార్తాసంస్థలు నివేదించాయి. ఈ విషయంపై దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ట్విట్టర్లో స్పందించారు.
"మాస్టర్' సినిమాను మీముందుకు తీసుకురావడానికి ఏడాదిన్నర కాలం పాటు కష్టపడ్డాం. మీరంతా థియేటర్లోనే సినిమాను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా. ఈ చిత్రంలోని లీకైన వీడియో లింకులను సోషల్‌మీడియాలో దయచేసి షేర్ చేయకండి".