తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన కొత్త చిత్రం 'మాస్టర్' విడుదలపై కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమాను ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని తొలుత నిర్ణయించినా.. కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత జూన్ 22న రిలీజ్ చేయనున్నారని ప్రచారమూ జరిగినా చిత్రబృందం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.
'మాస్టర్' సినిమా విడుదల అయ్యేది అప్పుడే! - మాస్టర్ సినిమా విడుదల తేదీ
తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కిన 'మాస్టర్' చిత్రం విడుదలపై కోలీవుడ్లో మరో కొత్త ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది.
'మాస్టర్' సినిమా విడుదల అయ్యేది అప్పడే!
కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు 'మాస్టర్' చిత్రాన్ని దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని తెలుస్తోంది. నవంబరు 12న విడుదల తేదీని ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాలంటే అధికార ప్రకటన వచ్చేంత వరకు ఎదురుచూడాల్సిందే.
'మాస్టర్' సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించగా.. అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషించాడు.
Last Updated : Jul 7, 2020, 8:46 AM IST