Liger Movie Release date: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'లైగర్' సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. వచ్చే ఏడాది ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ ఏడాది డిసెంబరు 31 చిత్రానికి సంబంధించిన ఓ గ్లింప్స్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపింది.
Liger Movie Release date: 'లైగర్' రిలీజ్ డేట్ ఫిక్స్ - Liger movie release date announced
Liger Movie Release date: విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు పూరీజగన్నాథ్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 'లైగర్'. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్రబృందం. వచ్చే ఏడాది ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు తెలిపింది.
లైగర్ అప్డేట్
పాన్ ఇండియా స్థాయిలో ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా 'లైగర్' మూవీని నిర్మిస్తున్నాయి. పూరీజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్. దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా తర్ఫీదు పొందారు.
ఇదీ చూడండి: మహేశ్ బాబుకు పోటీగా విజయ్ దేవరకొండ!