తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సాధారణ నటుడు నుంచి రౌడీ స్టార్​గా విజయ్​

'అర్జున్​ రెడ్డి'తో సెన్షేషన్​గా మారిన హీరో విజయ్​ దేవరకొండ.. దక్షిణాదితో పాటు బాలీవుడ్​లోనూ క్రేజ్​ తెచ్చుకున్నాడు. నేడు ఇతడి పుట్టినరోజు సందర్భంగా అతడిపై ప్రత్యక కథనం.

vijaydevarakonda
విజయ్​దేవరకొండ

By

Published : May 9, 2020, 12:42 PM IST

అప్పటి వరకు అతడు ఓ సాధారణ నటుడు. బ్రేక్‌ కోసం ఆరేళ్లుగా చిత్ర పరిశ్రమలో కష్టపడుతున్న కుర్రాడు. 2017 ఆగస్టు 25న 'అర్జున్‌రెడ్డి'తో ఒక్కసారిగా దేశంలో సెన్సేషన్‌గా మారాడు. టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ యమ క్రేజ్ తెచ్చుకున్నాడు. అతడే యువహీరో రౌడీబాయ్​ విజయ్‌ దేవరకొండ.

ఇదంతా అతనికి ఒక్కరోజులో వచ్చిన ఫేమ్‌ కాదు. ఎన్నో ఆడిషన్స్‌.. తిరస్కారాలు.. నిరాశల తర్వాత ఈ స్టార్‌డమ్‌ను సంపాదించాడు. ఇన్ని అవరోధాలు దాటి నేడు స్టార్ హోదా దక్కించుకున్నాడు.‌ ఈరోజు విజయ్​ పుట్టినరోజు సందర్భంగా అతడు నటించిన సినిమాలపై ఓ లుక్కేద్దాం.

బాలనటుడుగా

పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే 'శిరిడిసాయి ప్రతి సాయి దివ్య కథ' సీరియల్‌లో విజయ్​, బాల నటుడి కనిపించాడు.

'శిరిడిసాయి ప్రతి సాయి దివ్య కథ' సీరియల్‌లో బాల నటుడుగా విజయ్​

నువ్విలా

దీంతో వెండితెరకు పరిచయమయ్యాడు. 2011లో వచ్చిన ఈ సినిమాలో క్రికెటర్​గా కనిపించాడు.

'నువ్విలా' ... నటుడుగా విజయ్​ తొలి సినిమా

లైఫ్​ ఈజ్​ బ్యూటిఫుల్

శేఖర్​ కమ్ముల తీసిన ఈ చిత్రంలో సహాయ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు విజయ్.

లైఫ్​ ఈజ్​ బ్యూటిఫుల్​

ఎవడే సుబ్రహ్మమణ్యం

నాని హీరోగా నటించిన ఈ సినిమాలో రెండో కథానాయకుడిగా​ కనిపించాడు విజయ్​. జాలీగా తనకు నచ్చినట్లు ఉండే ఓ కుర్రాడి పాత్రలో నటించి మెప్పించాడు.

స్టైలిష్​ హీరోగా విజయ్​

పెళ్లిచూపులు

ఈ సినిమాతో విజయ్ హీరోగా పరిచయమయ్యాడు. చిన్న చిత్రంగా వచ్చి, సూపర్​హిట్​గా నిలిచింది. దర్శకుడు తరుణ్​భాస్కర్​ ప్రతిభకు గుర్తింపు దక్కింది.

పెళ్లిచూపులు

ద్వారక

ఈ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఇందులో ఓ దొంగ బాబా పాత్రలో కనువిందు చేశాడు విజయ్​.

ద్వారక

అర్జున్​రెడ్డి

ఈ సినిమాతో విజయ్​ ఓవర్​ నైట్​ స్టార్​ అయిపోయాడు. దక్షిణాది చిత్రసీమతో పాటు బాలీవుడ్​లోను ఫుల్​ క్రేజ్​ సంపాదించుకున్నాడు.

అర్జున్​రెడ్డి

ఏ మంత్రం వేశావే

2018లో వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.

ఏ మంత్రం వేశావే

మహానటి

అలనాటి తార సావిత్రి బయోపిక్​గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఓ ఫొటోగ్రాఫర్​గా కనిపించాడు విజయ్. ఇందులో కీర్తి సురేశ్ టైటిల్ రోల్ పోషించింది.​

గీతగోవిందం

ఈ సినిమాతో విజయ్​ తనలోని కొత్త కోణాన్ని చూపించాడు. 'మేడమ్​.. మేడమ్'​ అంటూ క్లాస్​గా కనిపించి ప్రేక్షకాదరణ దక్కించుకున్నాడు. ఇందులో రష్మిక హీరోయిన్​గా నటించింది. ఈ చిత్రం రూ.100 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.

మహానటి

నోటా

తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. అయితే ఆశించినంతగా ప్రేక్షకులను అలరించలేకపోయింది.

నోటా

ట్యాక్సీవాలా

థ్రిల్లర్​ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం.. హిట్​గా నిలిచింది.​ ఇందులో స్టైలిష్ ట్యాక్సీ డ్రైవర్​గా ​విజయ్​ కనువిందు చేశాడు.

ట్యాక్సివాలా

డియర్​ కామ్రేడ్​

గీతగోవిందంతో హిట్​ జోడి అనిపించుకున్న రష్మిక-విజయ్​.. మరోసారి ఈ సినిమాలో కలిసి నటించారు. దక్షిణాదిలో నాలుగు భాషల్లో విడుదలై, మిశ్రమ స్పందన అందుకుంది. యూట్యూబ్​లో వీక్షణల పరంగా రికార్డులు సృష్టిస్తోంది.

డియర్​కామ్రేడ్​

వరల్డ్​ ఫేమస్​ లవర్​

డిఫరెంట్​ కాన్సెప్ట్​ అంటూ వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీసు వద్ద యావరేజ్​గా ఆడింది. ఇందులో రాశీ ఖన్నా, కేథరీన్, ఐశ్వర్య రాజేశ్​, ఇస్​బెల్లా.. విజయ్​ సరసన నటించారు.

వరల్డ్​ ఫేమస్​ లవర్​

ఫైటర్​

మాస్​ డైరెక్టర్​ పూరీ జగన్నాథ్​ దర్శకత్వంలో పాన్​ ఇండియా కథ తెరకెక్కుతున్న సినిమా 'ఫైటర్'​. ప్రస్తుతం లాక్​డౌన్​ నేపథ్యంలో షూటింగ్​ నిలిచిపోయింది. బాలీవుడ్​ హీరోయిన్​ అనన్య పాండే విజయ్​కు జోడిగా నటిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details