తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మళ్లీ నటిస్తానో లేదో: లేడీ సూపర్​స్టార్ విజయశాంతి - lady super star

ప్రజాజీవితంలో మమేకమై, నటనకు ఇటీవలే రీఎంట్రీ ఇచ్చిన లేడీ సూపర్​స్టార్​ విజయశాంతి.. 'సరిలేరు నీకెవ్వరు' విజయంపై స్పందించింది. తనని మళ్లీ ఆదరించినందుకు అభిమానులకు ట్విట్టర్​లో ధన్యవాదాలు చెప్పింది.

vijayashanthi-shares-her-emotions-through-twitter
'మళ్లీ నటిస్తానో లేదో.. ఇప్పటికైతే సెలవు'

By

Published : Feb 3, 2020, 11:19 AM IST

Updated : Feb 28, 2020, 11:50 PM IST

లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి.. దాదాపు 13ఏళ్ల విరామం తర్వాత వెండితెరపై కనిపించింది. తనలో పవర్​ ఇంకా తగ్గలేదని నిరూపించుకుంది. 'సరిలేరు నీకెవ్వరు'లో భారతి అనే కాలేజీ ప్రొఫెసర్ పాత్రలో కనిపించింది. ఈ సినిమాకు ఘనవిజయం అందించిన ప్రేక్షకులకు ట్విట్టర్​లో ధన్యవాదాలు చెప్పింది. తన మొదటి చిత్రం నుండి ఇప్పటి వరకు, కొన్ని దశాబ్దాల పాటు నటిగా ఆదరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసింది. వీటితో పాటే మరో ఆసక్తికర వ్యాఖ్యను జోడించింది.​

"ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం... మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తోందో, లేదో నాకూ తెలియదు. ఇప్పటికి ఇక సెలవు. మనసు నిండిన మీ ఆదరణకు, నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు మీ విజయశాంతి..." అని భావోద్వేగంగా ట్వీట్ చేసింది విజయశాంతి.

విజయ శాంతి.. ఇక వరుస సినిమాలు చేస్తారని ఆశించిన అభిమానులకు, ఈ పోస్ట్ విస్మయానికి గురిచేసింది. అయితే ఆమె ఇక సినిమాలు చేయనని చెప్పలేదు. ప్రస్తుతానికి శెలవు తీసుకుంటున్నట్లు మాత్రమేనంది. భవిష్యత్తులో ఎవరైనా దర్శకులు మంచి పాత్రలతో వస్తే, ఆమె మళ్లీ వెండితెరపై కనిపించొచ్చు.

ఇదీ చూడండి.. మరోసారి సంక్రాంతి బరిలో మహేశ్​బాబు

Last Updated : Feb 28, 2020, 11:50 PM IST

ABOUT THE AUTHOR

...view details