తనదైన నటనతో లేడీ అమితాబ్ అనిపించుకున్న నటి విజయశాంతి... 53 ఏళ్ల వయసులోనూ తనలోని యాక్షన్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది. మహేశ్‌బాబు 'సరిలేరు నీకెవ్వరు'లో ప్రొఫెసర్ భారతిగా కనిపించి, ఆ చిత్ర విజయంలో కీలకంగా నిలిచింది. ఈ సినిమా షూటింగ్లో తీసిన అరుదైన వీడియోను నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్.. సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది.
విజయశాంతి మాస్టర్ కిక్.. అభిమానులకు మైండ్ బ్లోయింగ్ - entertainment news
'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్లో తీసిన ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. ఇందులో విజయశాంతి మాస్టర్ కిక్ కొడుతూ కనిపించింది.
నటి విజయశాంతి
ఇందులో నటుడు బ్రహ్మాజీకి సవాల్ చేస్తూ విజయశాంతి కాలెత్తి కిక్ కొడుతున్న వీడియో రాములమ్మ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. 'కర్తవ్యం', 'స్ట్రీట్ ఫైటర్' చిత్రాల్లో యాక్షన్ సన్నివేశాల్లో దుమ్ము దులిపిన విజయశాంతి... ఏళ్లు గడిచినా తనలో ఇంకా పవర్ తగ్గలేదని దీని ద్వారా నిరూపిస్తోంది.
Last Updated : Jan 14, 2020, 4:44 PM IST