కోలీవుడ్ ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్‌కాంత్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఆయనకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
కెప్టెన్ విజయ్‌కాంత్‌కు అస్వస్థత - VijayKanth admits in hospital
కోలీవుడ్ ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
విజయ్‌కాంత్‌కు అస్వస్థత
గతేడాది విజయ్‌కాంత్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అప్పట్లో ఆయన తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం కుదుటపడింది.