అలనాటి నటి, దర్శకురాలు విజయనిర్మల హైదరాబాద్‌లో మృతిచెందారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆమె బుధవారం అర్ధరాత్రి కన్నుముశారు. విజయనిర్మల మరణవార్త విని చిత్ర సీమ శోక సంద్రంలో మునిగిపోయింది. విజయనిర్మల 1946 ఫిబ్రవరి 20న జన్మించారు.
మహిళా దర్శక దిగ్గజం విజయనిర్మల ఇకలేరు - krishna
సూపర్ స్టార్ కృష్ణ సతీమణీ, నటి, దర్శకురాలు విజయ నిర్మల హైదరాబాద్‌లో మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
సూపర్ స్టార్ కృష్ణను వివాహం చేసుకున్నారు విజయనిర్మల. ఆమె కుమారుడు నరేశ్ కుడా సినీ నటుడే. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించిన ఆమె 44 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువ చిత్రాలను తెరకెక్కించిన మహిళా దర్శకురాలిగా గిన్నీస్ రికార్డు సాధించారు.
ఏడో ఏటనే బాలనటిగా కెరీర్ మొదలు పెట్టిన ఆమె 200కు పైగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించారు. బాపు దర్శకత్వంలో వచ్చిన 'సాక్షి' సినిమాతో తొలిసారి సూపర్‌స్టార్ కృష్ణతో జోడికట్టారు. అక్కడి నుంచి దాదాపు 50 సినిమాల్లో వీరు హిట్‌పెయిర్‌గా నిలిచారు.